సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతిభావంతులను సమాజం గుర్తించాలని, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే అంజిబాబు నివాసంలో నేడు, ఆదివారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థికి రూ 40 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ.. రాజమండ్రిలోని సాయి నర్సింగ్ హోమ్ కళాశాలలో పొన్నాడ ఉమా మహేశ్వరి మొదటి సంవత్సరం నర్సింగ్ కోర్సులో సీటు సాధించారని, హాస్టల్ ఫీజు నిమిత్తం రూ లక్ష అవసరం కాగా, దాతలను సమీకరించి రూ 40 వేలను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఖజనా అధికారి అడారి గణేష్, భీమవరం ఎస్టివో అల్లూరి రవివర్మ, సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
