సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇటీవల ఎన్కౌంటర్ లలో మావోల మృతికి ప్రతీకారంగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు. ఈ ఘటనలో 10 మంది అమరులయ్యారు. వీరిలో . 9 మంది జవాన్లు కాగా.. ఒకరు వ్యాన్ డైవర్‌ అని భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఘటనలో మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు. వారిని రాజధాని రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమచారం.( మందుపాతరకు ఏర్పడ్డ భారీ గొయ్యి చిత్రంలో చూడవచ్చు..) ఈ సంఘటన నేడు, సోమవారం బెద్రే – కుత్రు రహదారిపై చోటు చేసుకుంది. మరోవైపు శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఐదుకి పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *