సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి అన్నవరం దర్శనానికి వెళుతున్న భక్తులు కుటుంబం లో నేడు,శనివారం ఉదయం తీవ్ర విషాదం నిండుకొంది కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని భీమవరం నుండి వస్తున్నా ఢీకొట్టింది కారు. దింతో స్పాట్ లోనే ఇద్దరు మృతి మరో ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. ప్రమాదంలో కారు ఎంత వేగంగా ఢీ కొట్టిందో కానీ తుక్కు తుక్కు కావడం ఫై చిత్రంలో చూడవచ్చు.. ఆ సమయంలో భీమవరం కు చెందిన 7 గురు కుటుంబ సభ్యులు ఉన్నట్లు వారిలో ఇద్దరు మరణించగా తీవ్ర గాయాలతో 5 గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు చవాకులు ప్రసాద్, అనంతలక్ష్మి లుగా పోలీసులు గుర్తించారు. మరి పొగమంచు నేపథ్యంలో లారీ కనపడక డ్రైవర్ గుద్దేశాడో ? నిద్ర మగత వల్ల ?పూర్తీ వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
