సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి ఎన్ ఆర్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ & కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు ) గారి తండ్రి గాదిరాజు సోమరాజు గారు(94 సంవత్సరములు ) ది 19.01.2025 నేడు, ఆదివారం తెల్లవారుజామున పరమపదించారు . వీరు రోడ్లు భవనాల శాఖలో సుమారు 35 సంవత్సరములు ఇంజనీర్ గా పనిచేసి, 1989సంవత్సరము లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేసారు. వీరికి భార్య శ్రీమతి కాంతమ్మ ,ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు కలరు .వీరి కుమారుడు గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు ) భీమవరం పట్టణ వైస్ చైర్మెన్ గా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మెన్ గా గత కొన్ని సంవత్సరములు గా డి ఎన్ ఆర్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ & కరస్పాండెంట్ గా, మంచి విద్యావేత్తగా ,ప్రజాసేవకుడుగా, ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా అందరికి సుపరిచితులు. నేటి ఉదయం గాదిరాజు సోమరాజు గారి పార్థివ దేహమును పట్టణములోని ప్రముఖులు మాజీ రాజ్య సభ సభ్యులు తోట సీతామహాలక్ష్మీ , మెంటే పార్ధ సారధి, , గోకరాజు వెంకట నర్సింహారాజు గారు,గోకరాజు రామరాజు, గోకరాజు పాండురంగరాజు మరియు డి ఎన్ ఆర్ అసోసియేషన్ విద్యసంస్థల ప్రిన్సిపల్స్ ,అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్భంది సందర్శించి నివాళులు అర్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *