సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఫిబ్రవరి 2వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్ద తాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల వద్ద తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న అభ్యర్థులకు 50 ప్రఖ్యాత కంపెనీల ద్వారా 2000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు
