సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంక్రాంతి కి రాంచరణ్ తో 450 కోట్ల తో రూపొందించిన గేమ్ చేంజెర్ పాన్ ఇండియా సినిమా, మరియు వెంకీ మామతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అన్న బ్లాక్ బ్లాస్టర్ ( ఇప్పటికే 200 కోట్లు వసూళ్లు..) సినిమాలు రిలీజ్ చేసి, అలాగే నైజం లో బాలకృష్ణ డాకు మహారాజ్‌ సినిమాకి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆఫీసులు, ఇళ్లపై నేటి మంగళవారం ఉదయం నుండి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు శిరీష్, దిల్ రాజు కూతురు ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. అలాగే దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లోనూ ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేస్తున్న 56 బృందాలు, ఎనిమిది ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు. మరో వైపు మైత్రీ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. మైత్రీ సంస్థ ఇటీవలే పుష్ప 2తో భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా దేశంలో నెంబర్ వన్ గా ఏకంగా రూ. 18వందల 50కోట్లకు పైగా వసూల్ చేసినట్టు మేకర్స్ పోస్టర్స్ ద్వారా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *