సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు సినిమా సత్తా దేశానికీ చాటి అల్ ఇండియా అగ్రదర్శకుడుగా ఎదిగి దేశంలో ఎందరో ప్రఖ్యాత దర్శకులకు గురువు అయిన మన భీమవరం బ్రాండ్ రామ్ గోపాల్ వర్మ పాన్ ఇండియా అగ్ర దర్శకుడుగా రచయితగా , నిర్మాతగా చేసిన ,శివ, క్షణక్షణం, రంగీలా, దిల్ సే, దొంగ దొంగ, సత్య, కంపెనీ , మని ,సర్కార్ సిరీస్, రక్త చరిత్ర వరకు చేసిన ప్రయోగాలు అన్ని ఇన్ని కావు. మరి ఇప్పుడు టైం పాస్ సినిమాలు చేస్తున్నాడు. మరి తన ట్విట్టర్లో ఏవేవో ట్వీట్స్ వేసే ఆర్జీవీ తాజాగా వేసిన ఓ ఎమోషనల్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇటీవల ఆర్జీవీ తీసిన సత్య సినిమా రీ రిలీజ్ అయింది. జెడి చక్రవర్తి, మనోజ్ బాజపేయ్, ఊర్మిళ మండోద్కర్.. ముఖ్య పాత్రల్లో ఆర్జీవీ దర్శకత్వంలో 1998 లో వచ్చిన సత్య సినిమా అప్పట్లో పాన్ ఇండియా హిట్ పైగా ప్రపంచ అత్యుత్తమ అద్భుత స్క్రీన్ ప్లే 100 సినిమాలలో ఒకటిగా నిలచింది. తాజాగా 27 ఏళ్ళ తర్వాత సత్య సినిమాని ఇటీవల జనవరి 17న రీ రిలీజ్ చేసారు. ముంబైలో జరిగిన స్పెషల్ షోకి వెళ్లిన ఆర్జీవీ బాగోద్వేగానికి గురి అయ్యారు. తాజాగా ఆ సినిమా చూసిన తర్వాత తాను ఏడ్చానని, సత్య లాంటి సినిమా తీసిన నేను ఎలా దిగజారనో అహం నెత్తికెకించుకొని దిగజారిపోయానని, సత్య తరువాత నా తెలివితో నేను ఎందుకు ఈ సినిమాను భవిష్యత్తులో తీసే సినిమాలకు బెంచ్ మార్క్ గా పెట్టుకోలేకపోయాను అని ఆలోచించాను. నేను కేవలం ఆ సినిమాలోని ఎమోషన్ కి మాత్రమే ఏడవలేదు. అప్పుడు ఉన్న నా వర్షన్ కి కూడా ఆనందించి ఏడ్చాను. అలాగే సత్య సినిమాతో నన్ను నమ్మినవాళ్లందరికి నేను చేసిన ద్రోహానికి కూడా ఏడ్చాను. నేను మద్యం మత్తులో ఉన్నాను నేను ఎటువంటి విజయాలు సాదించానో .. నాకు రెండు రోజుల క్రితం వరకు అర్ధం కాలేదు. ఇకపై నేను ఏ సినిమా తీస్తున్న ముందు సత్య సినిమా చూస్తాను.. అంతగా కాకపోయిన గొప్పగా సినిమా తియ్యడానికి ప్రయత్నిస్తాను. అంటూ ఓ పెద్ద ట్వీట్ చేసారు ఆర్జీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *