సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ దేశీయ స్టాక్ మార్కెట్‌అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన ప్రకటించిన కొత్త వాణిజ్య సుంకాలు నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ భారీగా పతన మయ్యాయి. ఉదయం పాజిటివ్‌గా ట్రేడింగ్ ప్రారంభమైనా.. మదుపర్లు విక్రయాల వైపు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఓ దశలో సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23 వేల పాయింట్ల దిగువునకు పడిపోయింది. మంగళవారంనాడు సెన్సెక్స్ 1235.08 పాయింట్ల నష్టంతో ఏడే మాసాల కనిష్ఠ స్థాయిలో 75,838.36 పాయింట్ల దగ్గర క్లోజ్ కాగా.. నిఫ్టీ 320.10 పాయింట్ల నష్టంతో 23,024.65 పాయింట్ల వద్ద ముగిసింది.ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో పాటు ఆటోమొబైల్ రంగానికి చెందిన స్టాక్స్ భారీగా నష్టపోయాయి. మంగళవారం (జనవరి 21, 2025) ఒక్క రోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరయ్యింది.
