సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి భీమవరం పురపాలక సంఘం పరిధిలో 100% ప్లాస్టిక్ నిషేధం అమలు కొరకు నేడు, బుధవారం సాయంత్రం 5 గం లకు భీమవరం పురపాగల సంఘ కార్యాలయం నందు కమిషనర్, కే రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్లకు, శానిటేషన్ సెక్రటరీలకు మరియు చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది, కమిషనర్ వారు మాట్లాడుతూ పట్టణంలో అన్ని రకాల ప్లాస్టిక్ కవర్లు మరియు సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువులపై పూర్తిస్థాయి నిషేధం ఉన్న కారణంగా విక్రయదారులు సదరు నిషేధిత వస్తువుల క్రయవిక్రయాలు జరపరాదని నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించాలని వాటి అమ్మకాలు మాత్రమే జరపాలని ,నిషేధించిన ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు క్రయవిక్రయాలు జరిపిన యెడల వారికి పెద్ద మొత్తంలో పెనాల్టీలు విధించుటయే గాక వారి వారి షాపు యొక్క లైసెన్స్ క్లోజ్ చేయబడునని తెలియజేయడం జరిగింది అలాగే శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాలలో తోపుడు బండ్లపై ఆహార పదార్థాల క్రయవిక్రయాలు జరుగుతున్న వారు అన్ని రకాల ఆహార భద్రత ప్రమాణాలు పాటించవలసిందిగాను వారి షాపుల యందు చెత్త బుట్టలు తప్పక ఏర్పాటు చేసుకోవాలని,చెత్తను వారి షాప్ బయట గాని రోడ్లమీద గాని పారవేసినట్లు గుర్తించినట్లయితే వారికి పెనాల్టీలు విధించబడునని తెలియజేయడమైనది ఈ విషయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ సహకరించి భీమవరం పట్టణంలో స్వచ్ఛతకు పాటుపడవలసిందిగా .కమిషనర్ కోరారు .
