సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి తరువాత తెలంగాణాలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల వారి సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడులు తీవ్ర సంచలనం రేపిన నేపథ్యంలో .. గేమ్ చెంజర్, సంక్రాంతి కి వస్తున్నాం నిర్మాత దిల్ రాజు ఇంట్లో నేటి శనివారం తెల్లవారు జముతో తనిఖీలు ముగిసాయి. ముఖ్యంగా ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, ఆయన కుమార్తె హస్మిత రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నేడు, శనివారం ఉదయం నిర్మాత దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు రోజులుగా ఐటీ దాడులు జరిగాయని.. నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేశారని తెలిపారు. కొన్ని ఛానెల్స్ , సోషల్ మీడియాలో మా వద్ద ఎంతో డబ్బు డాక్యుమెంట్స్ దొరికాయని తప్పుడు వార్తలు వేశారని.. కానీ నిజానికి రూ.20 లక్షలలోపు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్‌లో మా లావాదేవీల డిటైల్స్ అధికారులు తీసుకున్నారని చెప్పారు. పైనల్‌గా తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చెక్ చేశారన్నారు. అంతా క్లీన్‌గా ఉందని.. డిపార్ట్‌మెంట్ వారు ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. నేనేమి ఎవరికీ టార్గెట్ అవ్వలేదు.. ఎక్కువగా ఊహించుకొవద్దు.. ఎలాంటి హడావుడి లేదు… ఇండస్ట్రీ లో సినిమా కలెక్షన్స్ అంతా ఆన్‌లైన్‌లో బుకింగ్ .. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి’’ అంతా ఓపెనే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *