సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో పలు గ్రామాలలో ఆరోగ్య వివరాల సర్వే కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజగా ఆఫీసర్ – NCD పశ్చిమ గోదావరి జిల్లా అయిన డాక్టర్ సి. హెచ్. ధనలక్ష్మి గుట్లపాడు గ్రామం సందర్శించి NCDCD 3. O ప్రోగ్రామ్ తనిఖీ నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ లబ్ధిధారుల ఇళ్లవద్దకు వెళ్లి వారి వ్యాధుల వివరాలు సేకరించారు. ANM APP లో వివరాలు అడిగి తెలుసుకొన్నారు .ఆరోగ్య సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. NCDCD 3. O కార్యక్రమం సర్వే క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం గొల్లవానితిప్ప వైద్యురాలు డాక్టర్ ఏ . అరుణ రాణి గారు,ఎమ్. పి. హెచ్,ఇ . ఓ. అప్పారావు , జిల్లా ఏపీడిమియాలాజి సుభాష్ , సూపర్ వైజర్ , నర్స్లుఆయాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *