సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేడు, శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రిజైన్ లెటర్ సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి చెప్పారు. ఉపరాష్ట్రపతికి తన రాజీనామా అందించాననీ, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారని చెప్పారాయన. ఈ రాజీనామా విషయంపై వైసీపీ అధినేత లండన్ లో ఉన్నజగన్‌తో ఫోన్‌లో మాట్లాడాననీ, ఆయనతో అన్నీ మాట్లాడాకే అయన అనుమతి తోనే రాజీనామా చేశానని విజయసాయి వివరించారు. త్వరలో వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని విజయసాయరెడ్డి చెప్పారు. ఇకపై భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనన్నారు. తన పిల్లల సాక్షిగా కాకినాడ పోర్ట్ వ్యవహారంతో ఏం సంబంధ లేదన్నారు. తాను బయటకు వెళ్ళటంతో వైసీపీ కి నష్టం లేదని అత్యంత ప్రజాదరణ ఉన్న నేత జగన్ అని ప్రశంసించారు. నాలాంటి ఎందరో నాయకులను సృష్టించగలరని పేర్కొన్నారు.విజయసాయిరెడ్డి.. ఇప్పుడు అస్త్రసన్యాసం చేస్తూ తనను ప్రోత్సహించారంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు చెప్పడం వారికీ రుణపడి ఉన్నానని, హిందువు గా గర్వపడుతున్నానని అనడం వెనుక ఎదో ‘కీలక’భవిషత్తు అంశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నిస్సందేహంగా విజయసాయి వీడ్కోలు కచ్చితంగా వైసీపీని బలహీనపరిచే పరిణామమే. వైసీపీ మరో రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా బాట పడుతున్నారని తెలుస్తుంది.
