సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 76 వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా భీమవరంలోని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యలయములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. భాను నాయక్, ఎమ్. డి .లు జిల్లా లోని ఉత్తమ సేవలు అందించిన వైద్య ఆరోగ్య శాఖ లోని వివిధ విభాగాల సిబ్బందికి ప్రశంసా పత్రాలను బాహుకరించారు. ఆరోగ్య సిబ్బంది ఉద్యొగ నిర్వహణ నిర్వహణ తో పాటు ‘ మానవ సేవే మాధవ సేవ’ అన్న సూక్తి ఎప్పుడు గుర్తుంచుకొని రోగుల పట్ల దయతో పని చేయాలన్నారు. ఈ సందర్భముగా జరిగిన కార్యక్రమంలో ఎమ్. డి .;డాక్టర్ సి. హెచ్. ధనలక్ష్మి , డాక్టర్ భావన మరియు వివిధ విభాగాల అధికారులు , జిల్లా వైద్య సిబ్బంది పాల్గొన్నారు .
