సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యుల కుల దేవత శ్రీనగరేశ్వర స్వామి మహిషాసుర మర్దని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈనెల 31న నిర్వహించే వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య ఆహ్వానితునిగా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి, జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో హెలీప్యాడ్ స్థలాలలను పరిశీలించి అధికారులకు భధ్రత ఏర్పాట్లపై ఆదేశాలు చేశారు. అనంతరం వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నిత్యాన్నదాన సత్రం ప్రాంగణంలో ఈనెల 31న హోమం నిర్వహించే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వాసవి ధామ్‌ను సందర్శించి 90 అడుగులు కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు , ఆర్‌అండ్‌బీ అధికారులు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
