సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 61వ వార్షిక ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చివరి వారం లోకి చేరుకొన్నాయి. ప్రతిరోజూ వేలాది భక్తులు శ్రీ అమ్మవారిని ఉదయం నుండి రాత్రి వరకు సందర్శించుకొంటున్నారు. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో భారీ సెట్స్ లైటింగ్ అలంకరణలు, వేదికపై నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ , నాటకాలు వీక్షించడానికి సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు భారీ సందడి వాతావరణం కనపడుతుంది. ఉత్సవాల్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలలో ఆఖరి 8 రోజులు అంటే ఈ నెల 7వ తేదీ నుండి 14వ తేదీవరకు శ్రీ అమ్మవారికి రోజుకో దేవి అలంకరణ లో అష్ట లక్ష్క్ష్మి దేవి అలంకరణలతో దర్శనం ఇస్తారు. ప్రతి రోజు దేవాలయం ఆవరణలో ఉదయం పూట కూడా మహిళల కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తో కోలాహలంగా ఉంటుంది.శని ఆదివారాలలో భక్తులు పోటెత్తిపోతున్నారు.ఇక ఈ నెల 12 తేదీ తో కళావేదికపై నిర్వహించే నాటక , ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ముగుస్తాయి. 13, 14వ తేదీలలో కార్యక్రమాలకు విశ్రాంతి ఇస్తారు.ఈనెల 14వ తేదీ ఉదయం 8 గంటల నుండి శ్రీ అమ్మవారికి మహా కుంభ నైవేద్యం అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహిస్తారు. సుమారు లక్ష మంది భక్తుల కోసం సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
