సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ బి.వీ.రాజు ఫౌండేషన్ వారి విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ లోని ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) మరియు ఇన్నోవేషన్ అండ్ ఎంట్రెప్రినేటర్ షిప్ డెవలప్మెంట్ సెంటర్ (IEDC) ఆధ్వర్యంలో తాజగా జరిగిన 2025 టెక్ స్ప్రౌట్ – 2K25 ఘనంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మంగం వేణు తెలియజేసారు. కళాశాలలో IIC బృందం క్యాంపస్‌లో ఆవిష్కరణలను పెంపొందించడంలో విశేషంగా కృషి చేస్తోందని, దీని ద్వారా విద్యార్థులు ఆవిష్కరణల వైపు మరింత ఆసక్తి కనబరుస్తు న్నారని అన్నారు. శ్రీ విష్ణు సొసైటీ వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్,మరియు సొసైటీ సెక్రటరీ ఆదిత్య విస్సం మాట్లాడుతూ.. టెక్‌స్ప్రౌట్- 2K25 లక్ష్యం ఒక్క విష్ణు ఇన్స్టిట్యూట్‌కి మాత్రమే పరిమితం కాకుండా, విష్ణు క్యాంపస్‌లోని ఇతర కళాశాలల విద్యార్థులను కూడా ప్రోత్సహించడం అని “టెక్ స్ప్రౌట్ – 2K25” లో ప్రదర్శించిన ప్రాజెక్టులు సామాజిక ప్రభావం, పర్యావరణ పరిరక్షణ, భద్రత, ఆయుర్వేద, మూలికా ఔషధాలు, డ్రోన్లు, శిశు ఇంక్యుబేటర్ వంటి అనేక రంగాలలో ఉపయుక్తంగా మారుతాయని అన్నారు. అంతేకాక, స్టార్టప్ కల్చర్ ద్వారా ఉపాధిని సృష్టించడంతో పాటు, సమాజానికి సేవ చేయగలమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భముగా టెక్ స్ప్రౌట్ – 2K25 లో మొత్తం 27 జట్లు పాల్గొనగా, వాటిలో 13 జట్లు ఫైనల్‌కు ఎంపికయ్యాయి E -సెల్ లోగోను ఆవిష్కరించారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు.
