సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 61 వ వార్షికోత్సవాలు లో భాగంగా నేటి నుండి వరుసగా 8 రోజులు శ్రీ అమ్మవారు అష్ట లక్ష్మిలుగా రోజుకో అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, గురువారం శ్రీ ఆదిలక్ష్మి దేవి అలంకరణలో నిలువెత్తు విరాట స్వరూపం దర్శనానికి భక్తులు విశేషంగా హాజరు అయ్యారు. ( ఫై చిత్రంలో ) ఈనెల 14వ తేదీ వరకు వేడుకలు ముగింపుగా అన్న సమారాధన ముందు రోజు వరకు శ్రీ అమ్మవారి విశిష్ట అవతారాలును ప్రతి రోజు భక్తులు దర్శించుకొని శ్రీ అమ్మవారి అస్సిసులు పొందాలని దేవాలయ సహాయ కమిషనర్ బుధ్హ మహాలక్ష్మి నగేష్ విజ్ఞప్తి చేసారు.
