సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందించేలా అత్యంత టెక్నాలజీతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. భీమవరం జెపి రోడ్డులో ‘మదర్ నెస్’ ఆసుపత్రిను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారాయణ, మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు , ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. ప్రముఖులు మాట్లాడుతూ.. వైద్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయని, సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నాయని అన్నారు. మదర్ నెస్ ఫౌండర్, డైరెక్టర్, శిశువ చిన్న పిల్లల వ్యాదుల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ వి వంశీ శివరామరాజు, గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ వైద్య నిపుణులు డాక్టర్ కె మానస శ్రావ్య మాట్లాడుతూ పసి ప్రాణాలు రక్షణే మా థ్యేయమని, శిశుమరణాలు అరికట్టాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రుని అత్యంత టెక్నాలజీతో ప్రారంభించామని అన్నారు. మా వైద్య బృందంతో సామాన్యులకు సైతం కార్పొరేట్ వైద్యం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు మెంటే పార్ధసారధి,మాజీ ఎమ్మెల్సీ లు మేకా శేషుబాబు, అంగర రామ్మోహన్ రావు, భీమవరం డాక్టర్లు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
