సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శుక్రవారం .మధ్యాహ్నం భీమవరంలోని బీజేపీ నరసాపురం పార్లమెంటరీ కార్యాలయంలో ఎంపీ మరియు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అడ్జక్షతన జరిగిన పశ్చిమగోదావరి జిల్లా పదాధికారులు మరియు నూతన మండల అధ్యక్షుల సమావేశంలో జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మండల మరియు బూత్ కమిటీలు పూర్తి చేయడం గురుంచి చర్చించడం జరిగింది. నూతన బాధ్యతలు స్వీకరించిన మండల అధ్యక్షులు మరియు సభ్యులు పార్టీ యొక్క బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని మంత్రి శ్రీనివాస్ వర్మ వారికీ దిశానిర్దేశం చేయడమైనది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ , జిల్లా అధ్యక్షులు శ్రీదేవీ తదితరులు జిల్లా నేతలు పాల్గొన్నారు.
