సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏమిటో ఇటీవల దేశంలో ఉహించనడానికి భిన్నంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. ట్రంప్ అమెరికా అడ్జక్ష పీఠం ఎక్కింది మొదలు.. ఇండియా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. మొన్న ఢిల్లీలో బీజేపీ విజయం సాదించినప్పుడు స్టాక్ సూచీలు పెరిగిపోతాయనుకొంటే దానికి బిన్నంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలోనే నేడు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాలతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 548.39 పాయింట్లు పడిపోయి 77,311.80 వద్ద ముగిసింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా 178.35 పాయింట్లు తగ్గి 23,381.60 వద్ద ముగిసింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ ఏకంగా 1138 పాయింట్లు దిగజారింది. అయితే ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ షేర్లు కొన్ని ప్రారంభ లాభాలను నమోదు చేశాయి. రూపాయి విలువ మరింత తగ్గింది. ఈ క్రమంలో రూపాయి విలువ 0.2% తగ్గి రూ. 87.59కి చేరుకుంది.
