సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక సర్వే ప్రకారం.. మన దేశంలో సిగరెట్ తాగే వారి సంఖ్య 27 కోట్లకు పైగా ఉంది. వీరిపై పన్నుల ద్వారా ప్రభుత్వానికి రూ.80,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది ఈసారి మరింత ఆదాయం పెరగనుంది.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచడంతో గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ సారి పన్ను వసూళ్లు తగ్గుతాయని భావిస్తున్నారు. దీనిని భర్తీ చేయడానికి, ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై GSTని పెంచబోతోంది. ఇలా జీఎస్టీ పెంచినట్లయితే సిగరేట్ల ప్రియులకు శరాఘాతం కానుంది. సిగరెట్ల ధర మరి కొద్దీ రోజులలోమరింత పెరిగే అవకాశం ఉంది. మానవ ఆరోగ్యానికి హానికరమైన పొగాకు, మద్యం ఉత్పత్తులను ప్రమాదకరమైన వస్తువులుగా పరిగణించి వాటిపై ఎక్కువ పన్ను విధిస్తారు. భారతదేశంలో 28% GSTతో సహా, సిగరెట్లపై మొత్తం పన్ను 53 శాతంగా ఉన్నాయి. ఇందులో 5% పరిహార సెస్ కూడా ఉంటుంది. ఎక్సైజ్ సుంకం, జాతీయ విపత్తు నిధి సుంకంతో సహా మొత్తం పన్ను రేటు 10%. ఇది 52.7 శాతం అవుతుంది. ఈ పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని గరిష్టంగా 40 శాతానికి పెంచడంతో పాటు అదనపు ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కూడా జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
