సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కళాశాల లో తెలుగు బాషా విశిష్టత ఫై విద్యార్థులతో చర్చ వేదిక నిర్వహించారు. మనం మాతృభాష తెలుగు లో మాట్లాడేందుకు, చదవటానికి రాయడానికి గర్వపడాలి అని..దేశంలోనే అత్యంత ప్రాచీన బాషా, ఈస్ట్ అఫ్ ఇటాలియన్ గా ప్రపంచ మేధావులతో కీర్తింప బడిన తేనెతోలుకు తెలుగు బాషా ప్రాచుర్యం కోసం మన తెలుగు కవులు, సాహితి ప్రియులు చేస్తున్న కృషి ని మన యువతరం కొనసాగించాలని దేశభాష లందు తెలుగు లెస్స అన్ని కర్ణాటకకు చెందిన శ్రీ కృష్ణ దేవరాయలు ప్రసంసించారని , దేశంలో హిందీ తరువాత అత్యధికులు మాట్లాడే బాషా తెలుగు మాత్రమే నని తెలుగు బాషా కోసం విదేశీయులు బ్రౌన్ దొర వంటి మహనీయులు సైతం ఎంతో కృషి చేసారని వక్తలు అన్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలో తెలుగు సాహితి ప్రియులు, కేజీఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ దాయన చంద్రజీ కి సత్కారం నిర్వహించారు.
