సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగారం కొనుగోలుదారులకు తాజా సమాచారం ప్రకారం.. ఈ శుభకార్యల సీజన్ లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నేటి మంగళవారం ఉదయం 10 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం..తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, విశాఖపట్నంలో, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో 10గ్రాముల బంగారం ధర రూ.80,750గా ఉంది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మరింత పెరిగింది. రూ.220 పెరిగి ధర రూ.88,090గా ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.80,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,240గా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కిలో వెండి 1,08,000 రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి.
