సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పోసాని మురళి అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య కు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి భోరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రెడ్ బుక్ పాలన సాగుతుందని, ఇప్పటికే ఎందరో వైసీపీ నేతలను బెదిరింపులకు లోను చేస్తున్నారని మరి కొందరిని అరెస్టులు చేస్తున్నారని అన్నారు. జరుగుతున్నా కక్ష సాధింపులను దేవుడు ప్రజలు చూస్తున్నారని .. అపట్లో పవన్ అభిమానులు తన ఇంటిపై దాడి చేశారన్న కోపంతో పోసాని అన్న మాటలను పట్టుకొని ఇప్పుడు కేసులు పెడితే భయపడేది లేదని, పార్టీ లీగల్ టీమ్ పోసానికి అండగా నిలుస్తుందని ఆయనను కాపాడుకొంటామని భయపడవద్దని జగన్ భరోసా ఇచ్చారు.
