సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘తండేల్‌’ (Thandel). సినిమా ఇకపై ఈ మర్చి నెల 7వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటిటీ ప్రేక్షకులను అలరించనుంది. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి, పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా అల్లు ఆర్ట్స్, బన్నీ వాసు నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు చందూ మొండేటి. ఈ సినిమాకు మంచి పీల్ ఇచ్చే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ గా నిలచింది. సాంగ్స్ సూపర్ హిట్.. గత ఫిబ్రవరి 7న విడుదలైన ఈచిత్రం రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్య కెరీర్‌లోనే మంచి కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్ ఎక్స్‌ వేదికగా తెలియజేసింది. దురదృష్టవ శాత్తు ఈ సినిమా రిలీజ్ రోజు నుండే హెడి క్వాలిటీ ప్రింట్ వైరల్ కావడం తో సినిమా విజయాన్ని కొంతమేరకు అడ్డుకొందని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *