సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సాధారణంగా విద్యార్థులు చదవకపోతే మాస్టర్స్ ఏమి చేస్తారు? గట్టిగ తిడతారు లేకపోతే దండిస్తారు.. అయిన మార్కులు రాకపోతే తల్లి తండ్రులను పిలిపించి మాట్లాడతారు.. అయితే వీటన్నిటికీ బిన్నంగా ఆ హెడ్ మాస్టర్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయనగరం జిల్లా పరిషత్తు పాఠశాలలో విద్యార్థులను ఎంతగా ప్రోత్సహించిన పరీక్షలలో ఫలితాలు రాకపోయేసరిగా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ హెచ్ ఎం రమణ అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ వేదికపైకి ఎక్కి చదువు లేకపోతె, పరీక్షలలో మార్కులు రాకపోతే నష్టపోతారని ఎన్నో సార్లు చెప్పానని, మీ తల్లి తండ్రులు కూడా మీపై శ్రద్ద చూపవలసి ఉందని, గురువుగా నేనే ఫెయిల్ అయ్యానని.. మిలో చాల మంది చదువుపై శ్రద్ద పెట్టడం లేదని, మార్కులు రావడం లేదని అందుకు శిక్షగా మీకు దండం పెట్టాలని వేదికగా సాష్టాంగ నమస్కారం చేసి వరుసగా గుంజీలు తీసి తన బాధను వాళ్ళ ముందు ప్రదర్శించారు. ఇప్పటికైనా ఆ విద్యార్థులు సిగ్గుతోనైనా మంచి ఫలితాలు సాధించాలని కోరుకొందాం..
