సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసెంబ్లీలో వాట్సాప్‌ గవర్నెన్స్‌పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేష్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో వాట్సాప్‌ గవర్నెన్స్‌ను ప్రపంచంలోనే మెరుగ్గా నిర్వహిస్తామని, ఈ ఏడాది జూన్‌ 30నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మన మిత్రలో వాట్సాప్‌ ద్వారా అందిస్తామని చెప్పారు. 1983లో ఎన్టీఆర్‌ సీఎం అయిన వెంటనే పటేల్‌-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలనను ప్రజల ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలన, ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని చంద్రబాబు పదే పదే చెప్పేవారని తెలిపారు. పాదయాత్రలో ప్రజలను కలిసినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల ముందు పడిగాపులు పడాల్సి వస్తోందని తన దృష్టికి తెచ్చారని లోకేశ్‌ వివరించారు. ప్రభుత్వ సేవలు ఇంటికి ఎందుకు రావని ప్రజలు తనను ప్రశ్నించారని ఆయన చెప్పారు. ఆఫీసులకు వెళ్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, గంటల తరబడి వేచిఉండాల్సి వస్తుందని, అందుకే సామాన్య ప్రజలు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *