సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్ణాటక రాష్ట్రము లోని హుస్సూరులో నేడు, ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. శ్రీ మద్దూరమ్మ అమ్మవారి రథోత్సవ వేడుకల్లో ప్రమాదవశాత్తూ 120 అడుగుల ఉన్న రెండు రథాలు మీద పడి ఇద్దరు భక్తులు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వేడుకలు నేపథ్యంలో ఆలయ ఉత్సవ నిర్వాహకులు ఐదు భారీ రథాలను సిద్ధం చేశారు. నేడు, ఆదివారం ఉదయం ఉరేగింపు కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అయితే రథాలు బెంగళూరు జాతీయ రహదారి ఎలక్ట్రానిక్ సిటీ వద్దకు రాగానే పెద్దఎత్తున గాలి దుమారం చెలరేగింది. బలంగా గాలులు వీయడంతో రెండు రథాలు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో రథాల కింద పడి ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోలాయరు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానికులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు.మిగతా రథాలు కూలిపోతుండగా వందల మంది భక్తులు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తీ సమాచారం అందవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *