సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని కి ఆకస్మికంగా గుండెపోటు రావడం తో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడివాడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వైసీపీ నేతలు నేటి ఉదయం నుండి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మనో నిబ్బరం పెంచడానికి ఆసుపత్రి వద్దకు చేరుకొంటున్నారు.. విషయంలోకి వస్తే.. గత మంగళవారం రాత్రి కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్యతో చూపించుకోవడానికే ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు ఆకస్మికంగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నేటి బుధవారం మధ్యాహ్నం తర్వాత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి డాక్లర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశముంది. గత రెండు రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు కిడ్నీ సమస్య ఉన్నట్లు భావిస్తున్నారు వరుసగా.4సారులు గుడివాడ ఎమ్మెల్యేగా గెలచి ఇటీవల ఎన్నికలలో పరాజయం పొందాక, ఇటీవల రాజకీయ కార్యకలాపాలు తగ్గించిన కొడాలి నానికి నిజానికి వైసీపీ లో అధికారంలో ఉన్నపుడు కూడా తరుచు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని . పలు కధనాలు సోషల్ మీడియాలో వస్తున్నపుడు ఆయన ఓపెన్ అయ్యేవారు కాదు.
