సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకప్రక్క దేశ వ్యాప్తంగా ఎన్నికల కమిషన్ తీరు ఫై విపక్షలు అన్ని ఒక్కతాటి పైకి వచ్చి విరుచుకోనిపడుతుంటే.. దక్షిణ భారతంలో ఏపీలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన ఎన్డీయే కూటమిలో భాగంగా ఉండగా.. నిజానికి 2024 ఏపీ ఎన్నికలలో ఎదో జరిగిందని, తమ ఓటమిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని బహిరంగంగా దేశంలో మొదట గళం విప్పిన వై ఎస్ జగన్ తరువాత మిశ్రమయంగానే స్వాందిస్తూ వస్తున్నారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తో వైసీపీ పార్టీ ఎక్కవ నష్టపోయినట్లు ఎన్నో సర్వే సంస్థలు , పరకాల ప్రభాకర్ లాంటి ప్రముఖులు ఆధారాలతో సహా ప్రకటిస్తున్నప్పటికీ ప్రస్తుత ఆందోళనల విషయంలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ తటస్థంగా ఉంది. వైసీపీ పార్టీ ఇప్పటి వరకూ ఆందోళనలు చేపట్టడం లేదు. పారదర్శకత, జవాబుదారీతనం కాపాడటం ఎన్నికల సంఘం ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని జగన్ ఇటీవల ఎక్స్‌లో పోస్టు చేశారు. వైఎస్సార్సీపీ సైతం సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతోపాటు.. టీడీపీ, జనసేనలను విమర్శించడానికే పరిమితమైంది. బీజేపీ పైన కానీ కేంద్ర రాజకీయాలపై, ఉద్యమాలపై స్పందించడం లేదు. రాష్ట్ర స్థాయి సమస్యలపైనే పోరాడుతూ.. మరికొంత కాలంపాటు జాతీయ అంశాలపై మౌనంగా ఉండటమే మేలు.. అసలు జగన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సీఎం పదవికి దూరం చేసి జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీకి, తన తల్లిని, చెల్లిని తనకు దూరం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన మేలు కలగకూడదని, అధికారం లేకపోయిన.. ఇప్పటి వరకు తనను కొత్తగా ఎటువంటి కేసులలో ఇరికించకుండా చెడ్డగా ఒక్కమాట అనని మోడీ అమీషా లే బెటర్ అని, భవిషత్తు ఎన్నికలలో బీజేపీ తో లోపాయికారి పొత్తు పెట్టుకొంటే బాగుంటుందని వైసీపీ పార్టీ అధినేత జగన్ ప్యూహంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *