సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం ముందు గత 4 రోజులుగా రాహుల్ గాంధీ,విపక్షాలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తూ అంతకు మించి స్థాయిలో.. రేపు శనివారం అక్టోబర్ 10 నుంచి కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ_ ధర్నాకు దిగనుంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈరోజు అర్ధరాత్రి నుంచి నగరాన్ని తమ అధీనంలోకి తీసుకోనున్నారు.తాజా ఆదేశాల ప్రకారం.. నేటి శుక్రవారం రాత్రి నుండి ఢిల్లీ నగరాన్ని పోలీసులు అష్టదిగ్బంధనం చేయనున్నారు. ఇప్పటికే మెట్రో రైలు సేవలు నిలిపి వేశారు.మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల గేట్లను మూసివేయనున్నారు. అలాగే, న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లలో పలు సర్వీసులను నిలిపివేశారు. హోటళ్లు, పీజీ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు..సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. నగరంలో ఎలాంటి నిరసనలు, ధర్నాలకు అనుమతి లేదని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనితో సీజేపీ సుప్రీంకోర్టును సీజేపీ ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరిపిన ధర్మాసనం.. శాంతియుత నిరసనలకు జంతర్ మంతర్ కాకుండా మరోచోట యువతకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. ఇలా మెట్రో సేవలు రవాణా సేవలు నిలిపివేయడం ఎంతవరకు సమంజసం ?అని.స్థానిక ప్రజలను ఇబ్బందులు పెట్టకూడదని ప్రబుత్వాన్ని సుప్రీం కోర్ట్ ప్రశ్నించడం గమనార్హం
