సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్త ఏడాదిలో ప్రజల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మార్పులు ఏమిటంటే.. కేంద్ర ఆర్ధిక మంత్రి బడ్జెట్లో ప్రకటించిన ఆదాయపు పన్ను మార్పులు, గమనిస్తే.. ఉద్యోగుల వార్షిక ఆదాయంలో రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ స్టాండర్డ్ డిడక్షన్రూ.75 వేలు కలపి రూ.12.75 లక్షల వరకు ఎలాంటి పన్నూ చెల్లిం చాల్సిన అవసరంలేదు. అలాగే, రూ.25 వేలుగా ఉన్న వ్యాపార రిబేట్ను రూ.60వేలకు పెంచారు. బ్యాంకుల్లోని డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారికి) జమా వార్షిక వడ్డీ రూ.50,000 దాటితే.. దానిపై మూలం వద్ద పన్ను (టీడీఎస్)వసూళ్లు చేసేవారు. అయితే ఈ మొత్తాన్ని రూ.లక్షకు పరిధి పెంచారు. బ్యాంకుల నుంచి ఉన్నత చదువుల కోసం విద్యా రుణం తీసుకుని, ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే ఇకపై ఎలాంటి టీసీఎస్ ఉండదు. అలాగే కీలకమైన క్రెడిట్ కార్డులపై రివార్డుల్లో ఎస్బీఐ కార్డ్స్ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిరిండియా టికెట్ బుకింగ్ చేస్తే లభించే రివార్డులను తగ్గించింది. వాడకంలో లేని మొబైల్ ఫోన్లు, ఇన్యాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ
సేవలు నిలిచిపోనున్నాయి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *