సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని స్థానిక డి.ఎన్ .ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లో నేడు, శనివారం ఘనంగా ఫేర్వెల్ పార్టీ నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు)హాజరు అయ్యి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాజగా మన డీ.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 13 మంది బి.టెక్ చివరి సంవత్సరం విద్యార్థులు, ట్రాన్స్ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కు ఎంపికైనట్లు తెలియజేసి, విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు. అలాగే డీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో విద్యనభ్యసిస్తున్న పిల్లలు అందరికి చదువుతో పాటు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమని అదే విధంగా ఈ సంవత్సరం బయటకు వెళ్తున్న విద్యార్థులు అందరూ మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో సెలెక్ట్ అవ్వాలని ,విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగడానికి కళాశాల యాజమాన్యం ఎప్పుడూ సహకరిస్తామని అని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డా.ఎం.అంజన్ కుమార్ కంప్యూటర్ సైన్స్ విభాగం హెడ్| గద్దాడ సత్యనారాయణ ని మరియు విభాగ స్టాఫ్ కి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో వివిధ విభాగాల అధిపతులు డీన్స్ , స్టూడెంట్స్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *