సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని బి వి రాజు & వీరమ్మ పార్క్ సమీపంలో భోగలింగేశ్వరస్వము గుడి వద్ద గ్రీన్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ వారి అద్దర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం కేంద్రాన్ని నేడు, బుధవారం మద్యాహ్నం స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ప్రారంభించటం జరిగింది . ప్రతి వేసవి లో ప్రజల దాహార్తిని తీర్చడానికి గత 16 సంవత్సరాలు గా ఈ మజ్జిగ చలివేంద్రంను ఇక్కడ గ్రీన్ పార్క్ వాకర్స్ వారు ఏర్పాటు చేసి 70 రోజులు పాటు దాతల సహకారంతో నిర్వహించడం హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పడాల విజయ్ కుమార్ (వాసు), కార్యదర్శి కందికట్ల ఆనందరావు, కోశాధికారి జూలూరి ఆదినారాయణమూర్తి, పర్రిపాటి శ్రీనివాస్,, తటవర్తి బదరీ నారాయణ, మహేష్, కట్రెడ్డి వెంకటచరణ్, రామాయణం చిన్నారి,చామన సత్యనారాయణ, వడుపు గోపి కోమటి వెంకటరమణ, తోరం సూర్యనారాయణ, మాదాసు బాబి, సాయి,దారపు రెడ్డి విక్రమ్ స్వాతి భాస్కరరావు, కూచంపూడి పెద్దిరాజు, మల్లుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
