సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ఇదే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు రూ కోటి 90 లక్షలతో 12 సీసీ రోడ్లను నేడు, బుధవారం ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తో కలసి ప్రారంభించారు. కొమరాడ గ్రామంలో రూ 91 లక్షల నిధులతో 5 సీసీ రోడ్లు, అనాకోడేరు గ్రామంలో రూ 39 లక్షలతో 5 సీసీ రోడ్లు, గొల్లవానితిప్ప గ్రామంలో రూ 60 లక్షలతో 2 సీసీ రోడ్లను మొత్తం రూ ఒక కోటి 90 లక్షల నిధులతో 12 సీసీ రోడ్లను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులపై గుప్పెడు మట్టెయినా వేయలేదని, ఎక్కడ చూసినా రహదారులు గోతులమయంతో దర్శనమిచ్చేవని, కూటమి ప్రభుత్వం 9 నెలల్లోనే అన్ని రోడ్ల పనులను పూర్తి చేసిప్రారంభించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పాల్గొన్నారు.
