సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉపాధ్యాయ సంఘాల (FAPTO) పిలుపు మేరకు నేడు, బుధవారం మధ్యాహ్నం భీమవరం లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భీమవరం యూనిట్ నుండి ఎక్కువ సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. వారికీలక డిమాండ్స్ ఏమిటంటే.. (1)12వ PRC కమిషన్ ను వెంటనే నియమించాలి. (2)30% IR ప్రకటించాలి. (3)2018 జూలై నుండి రావలసిన DA అరియర్స్ చెల్లించాలి. (4)11వ PRC అరియర్స్ చెల్లించాలి.(5)2024 జనవరి, జూలై DA లు ప్రకటించాలి. (6)పెన్షనర్స్ కు 11వ PRC లో తగ్గించిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు నిండిన వారికి 7% నుండి 10% కు 75 సంవత్సరాలు నిండిన వారికి 12% నుండి 15% కు పెంచాలి. (7)UGC వారికి కూడా ఈ రూల్స్ వర్తింపచేయాలి. (8)12 లక్షల నుండి 16లక్షలకు పెంచిన గ్రాట్యుటీ చెల్లింపు తేదీ 01-04-2020 నుండి అమలు చేయాలిఅని డిమాండ్ చేసారు. ఈ నిరసనలో జిల్లా కోశాధికారి బి.వి.రవిప్రసాద్, యూనిట్ కార్యదర్శి పి.సీతారామరాజు, కోశాధికారి పి.వి.ఆర్.ఎస్.ఎస్. సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరి కె.వి.వి.ముత్యాలరావు, కార్యవర్గ సభ్యులు జి.జయరాజు, టి.వి.వి.సత్యనారాయణ, కామన నాగేశ్వరరావు, , భట్టిప్రోలు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *