సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క తమ్ముడు మంచు మనోజ్ ఇంటికొచ్చి గడవ చేస్తున్న తరుణంలో మరో పక్క పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న కన్నప్ప సినిమా ప్రమోషన్స్ ను మోహన్ బభౌ, తనయుడు విష్ణు వేగవంతం చేసారు. తాజాగా నేడు, భుధవారం కన్నప్ప సినిమాను నిర్మించిన పవర్‌హౌస్ బృందం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లక్నోలో కలిసింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, నటుడు, నిర్మాత మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వినయ్ మహేశ్వరి సీఎం యోగి చేతులమీదుగా కన్నప్ప పోస్టర్ సినిమా విడుదల డేట్ ప్రకటింప చేసారు. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని అధికారికంగా ప్రకటించారు. కన్నప్ప చిత్ర బృందం భారతీయ సినిమా క్యాలెండర్‌లో ఒక గొప్ప సినిమాగా నిలిచిపోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి యోగికి సినిమా నిర్మాణానికి సంబందించిన వీడియో క్లిప్ ని చూపించారు. చిత్రం బృందం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో చేసిన ప్రయత్నాలను సీఎం యోగి ప్రశంసించారు. భారతీయ పురాణాలు, సంస్కృతి, భక్తికి సంబందించిన కథలను సినిమాల ద్వారా చెప్పడంలో ఉన్న ప్రాముఖ్యతను చెప్పారు.ఈ సందర్భంలో కన్నప్ప సినిమాను ఒక్కసారి చూడాలని మోహన్ బాబు కోరారు. అంతేకాదు మోహన్ బాబు విశ్వవిద్యాలయం కోసం తిరుపతిని సందర్శించాలని మోహన్ బాబు సీఎం యోగి ని ఆహ్వానించడం జరిగింది.
