సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత, దంతులూరి నారాయణరాజు కళాశాలలో నేడు, బుధవారం ఉదయం 10 గంటలకు 6 వ సెమిష్టర్ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాలను కళాశాల పాలకవర్గ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) ,విడుదల చేసారు. ఈ సందర్బంగా కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహ రాజు, గాదిరాజు బాబు మాట్లాడుతూ .. భారత స్వాతంత్య్రానికి పూర్యం స్ధాపించబడిన ఈ కళాశాల దిన దిన అభివృద్ది చెందుతూ నాణ్యమైన విద్యను అందించడంలో ఇప్పటికి ముందు వరుసలో ఉంటుందని, లాభాపేక్ష లేకుండా విద్యా బోదనే తమ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఎందరో మేధావులను సమాజానికి అందించామన్నారు. తమ కళాశాల లో చదివిన ప్రతి విద్యార్థికి చదువుతో పాటు తగిన అర్హత కలిగిన ఉద్యోగాలు కల్పించడంలో సహాయ పడుతున్నామని, ప్రస్తుత విద్య సంవత్సరంలో ఇంత వరకూ 250 మంది విద్యార్దినీ విద్యార్ధులకు ప్రఖ్యాత సంస్ధలలో ఉద్యోగ అవకాశాలు కల్పించామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ మాట్లాడుతూ ఈ రోజు విడుదల చేసిన డిగ్రీ కోర్సుల 6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో బి.ఎ 100 శాతం, బి.యన్.సి 100 శాతం, బి.కాం(జనరల్) 100 శాతం మరియు బి.కాం (కంప్యూటర్స్) 100 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా, అన్ని సెమిష్టర్ లలో ఉత్తీర్ణత బి.ఎ 75 శాతం, బి.యన్.సి 70 శాతం, బి.కాం(జనరల్) 73 శాతం మరియు బి.కాం (కంప్యూటర్స్) 75 శాతం సాధించారు.కళాశాల పాలకవర్గ సభ్యులు పి.రామకృష్ణంరాజు ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధినీ విద్యార్ధులను అభినందించారు. ఈ విద్యాసంవత్సరం నుండి విద్యార్ధులకు బి.బి.ఎ మరియు బి.సి.ఎ కోర్సులు కూడా అందుభాటులో ఉంటాయని తెలిపారు.
