సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం ఏపీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.విచారణా పూర్తీ అయ్యాక ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో తాను ఎప్పుడు జోక్యం చేసుకోలేదని, స్కాం జరిగిందని భావిస్తూ సిట్ విచారణ రమ్మని పిలిస్తేనే వస్తున్నానని కానీ అసలు స్కాం జరిగినట్లు,కొత్త మద్యం బ్రాండ్‌లను తయారు చేసి విక్రయించిన సంగతి తనకు తెలియదన్నారు. అందులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పాత్ర గురించి సైతం తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేశానన్నారు. దీనికి కర్మ, కర్త , క్రియా అంతా రాజ్ కసిరెడ్డి అని అతనిని పట్టుకొని విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే మద్యం విక్రయాలకు సంబంధించి అనుసరించవలసిన విధానాలపై తన గెస్ట్ హౌస్ లోనే వారు 2సార్లు మీటింగ్ పెట్టారని అక్కడ స్కాం కు సంబందించిన ప్రస్తావన రాలేదని , కొందరు పార్టీ మిత్రులు కసిరెడ్డి ని తనకు పరిచయం చేసారని, అతని మాటలు నమ్మి అతనికి పార్టీలో పెద్ద పదవులు అప్పగించి మోసయ్యపోయానని, అతనికి క్రిమినల్ మైండ్ ఉన్నట్లు తరువాత తనకు అర్ధం అయిందని అన్నారు. ఇప్పటికి 2 మీడియా సంస్థలు తాను జగన్ కు వ్యతిరేకంగా ఎదో సాక్ష్యాలు చెప్పేస్తానని, ఎదో జరిగిపోతుందని కొద్దీ రాజులుగా విపరీతంగా ప్రచారం చేస్తున్నారని, మీరు కోరుకున్నట్లు నేనెందుకు చెప్పాలని? ఇటువంటి పద్ధతులు మార్చుకోవాలని , మీడియాలో నిబద్ధత ప్రమాణాలు పాటించాలనే ఒక న్యూస్ ఛానెల్ పెట్టాలని ఎప్పటి నుండో చూస్తున్నానని అన్నారు. వైసీపీ పార్టీలో కూడా అందరు అనుకున్నట్లు నేను 2 కాదని తెలిపారు. జగన్ చుట్టూ కొటారి ఆయనకు.. నాపై ఎక్కించారని.. కోట్లు సంపాదించానని, వెన్నుపోటు పొడుస్తానని చెప్పి విజయం సాధించారని దానితో నా స్తానం అక్కడ 2000 స్థానానికి పడిపోయిందని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాని వాపోయారు. ఆఖరికి నా సూచనలతో నా ప్రమేయంతో ప్రారంభించబడిన సాక్షి మీడియాలో కూడా నా గురించి.. పార్టీలో 2వ స్తానం ఇస్తే జగన్ కు నమ్మక ద్రోహం చేసినట్లు, వ్యవసాయం చేసుకోకుండా మరల చేస్తున్నట్లు వార్తలు వేస్తున్నారని చురకలు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ కు పోటీలో లేనని, ప్రజలు కోరుకొంటే రాజకీయాలలోకి తిరిగి వస్తానని ఆఖరున ఝలక్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *