సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాశ్మిర్ లో పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం ఉద్రిక్తలు మధ్య పాక్ ప్రేరిత ఉగ్రవాదులు భారత్ లో మరిన్ని ఉత్పాతాలు సృష్టించకుండా కేంద్ర హోమ్ శాఖ పూర్తిగా అలర్ట్ అయ్యింది. దీనితో హిందువుల కలియుగ వైకుంఠంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల తిరుపతిలో పోలీసులు, టీటీడీ విజిలెన్సు అప్రమత్తమైంది. తిరుపతి, తిరుమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, విష్ణునివాసం, మాధవం, అన్ని ఆలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలలో పరిశీలిస్తున్నారు. అక్కడ ఎవరు అనుమానంగా తిరుగుతున్నవారిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. తిరుపతి శివారు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. తిరుపతిలోని అన్ని రోడ్లు, ముఖ్య కూడళ్లలో బాంబు, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు, కొన్ని భవనాలు పరిశీలిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రత పెంచారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇలాంటి తనిఖీలు మరో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధనరాజు చెప్పారు. తిరుపతి, తిరుమలలో మొత్తం 75 ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇక, అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
