సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గన్నాబత్తుల క్రీడా మైదానంలో ఘనంగా జరుగుతున్నా చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటక పోటీలు నిర్వాహకులు అభినందనీయులు.. నేటి ఆదివారం రాత్రి తో ముగియనున్నాయి. ఈ ఉచిత ప్రదర్శనలకు అందరు ఆహ్వానితులే.. ఈ నేపథ్యంలో గత శనివారం రాత్రి ప్రదర్శిరించిన మూడు నాటికలు ఆకట్టుకున్నాయి. మూడో రోజు నాటిక పోటీలలో . మహతి క్రియేషన్స్ వారి హైదరాబాద్ “ఉక్కు సంకెళ్ళు”, చైతన్య కళా స్రవంతి విశాఖ వారి “(అ) సత్యం”, మిత్రా క్రియేషన్ హైదరాబాద్ వారి “ఇది రహదారి కాదు”, వంటి నాటికలు ప్రేక్షకులను అలరించాయి. దైవత్వమైన రాక్షసత్యమైన స్వార్ధమైన అది మనిషి హృదయంలోనే ఉంటుంది .. అబద్దమైన సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం అంటూ (అ) సత్యం నాటిక, దారితప్పిన యువ జంటను చక్కదిద్దిన దృశ్య రూపమే .. ఇది రహదారి కాదు”, నాటిక, 1840 ఏళ్ళ నాటి రాణిరాస్మాణీ దేవి జాలర్లకు చేసిన సాయం విశిష్టతను తెలియజేసే ఉక్కు సంకెళ్ళు” వంటి నాటికలను అందరిని ఆకట్టుకున్నాయి. న్యాయ నిర్ణేతలుగా నుసుము నాగభూషణం (గుంటూరు), లండ రుద్రమూర్తి (భిలాయి), మానాపురం సత్యనారాయణ (పాలకొల్లు) వ్యవహరించారు. 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి అనీషా, మంతెన రామ్ కుమార్ రాజు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు, బొండా రాంబాబు, పెన్నాడ శ్రీను, తదితరులు పాల్గొన్నారు
