సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల ఉండి నియోజవర్గంలో ఆక్రమణలు తొలగింపులో ఇల్లు కొల్పోయిన నిజమైన పేదలకు మరోచోట స్థలం తో పాటు సుమారు 3 లక్షల ప్రభుత్వ గ్రాంట్ ఇప్పిస్తున్నామని, ఇప్పటికే ఐ భీమవరం, ఆకివీడు, పెద్దమిరం వంటి పలుచోట్ల ఎన్నో స్థలాలు, గ్రాంట్లు ఇచ్చి పేదలకు సహకరించమని, అయితే, ఇటీవల పాలకోడేరు లో ఇరిగేషన్ స్థలంలో ఇళ్ల తొలగింపు నేపథ్యంలో కొందరు సిపిఎం నేతలు నా దగ్గరకు వచ్చి పరుష పదజాలంతో మాట్లాడారని, బ్యాంకులకు ఎగ్గొట్టానని ఎన్నికల అఫడవిట్ లో నేనే స్వయంగా ఒప్పుకొన్నానని అవగాహన లేని మాటలు మాట్లాడారని, నేను దానికి తగినట్లే వారికీ సమాధానం ఇచ్చానని నిజమైన పేదలకు ద్రోహం చెయ్యనని హామీ ఇచ్చానని, అయితే ఆ సిపిఎం నేతలలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ అనే పెద్ద స్థాయిపదవి ఉన్న వ్యక్తి తనకు ఎప్పడు తెలియదని, ఆయననే తిడతారా ? డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాటలా? 30 రోజులలో క్షమాపణ చెప్పాలని స్థానిక సిపిఎం నేతలు నన్ను డిమాండ్ చేస్తున్నారని, మరి మీ శ్రీనివాస్ గారు రాష్ట్ర స్థాయిలో వుండికూడా నా పదవిని గౌరవించి నాతొ మాట్లాడనందుకు ముందు క్షమాపణ చేపితే నేను ఆయనకు క్షమాపణ చెపుతానని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పంట, మురుగు కాలువలపై ఆక్రమించిన వారిని వదిలిపెట్టేదే లేదన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *