సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లు, ప్రజా వ్యతిరేక ఆర్థిక నిర్ణయాలకు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి,దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీ, బ్యాంకింగ్ ఉద్యోగులు తమ నిరసనను తెలియజేయనున్నామని అన్నారు. వచ్చే నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సౌత్ సెంట్రల్ జోన్ ఎల్‌ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త కార్యదర్శి కిషోర్‌కుమార్ పిలుపు నిచ్చారు. రాజమహేంద్రవరంలోని స్థానిక మోడల్ కాలనీలోని ఎల్‌ఐసీ ఉద్యోగుల భవన్‌లో రాజమండ్రి డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మే 20న జరిగే సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా సుమారు 10కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని,ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఇన్సూరెన్, బ్యాంకింగ్ తదితర ఆర్థిక సంస్థల ఉద్యోగులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న శ్రామిక వర్గమంతా కలిసి సమ్మె విజయవంతం చెయ్యాలన్నారు.
