సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాకిస్తాన్, భారత్‌ల మధ్య హైటెన్షన్ నెలకొంది. ఇరు దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. మరో ప్రక్క ఎట్టి పరిస్థితులలో ఈ నెల 11 లేదా 12వ తేదీ కల్లా భారత్ యుద్ధం ప్రారంభిస్తుందని పాకిస్తాన్ లోని రక్షణ అధికారులు తమ అంచనా ను తాజా గా ప్రకటించడం విశేషం. భారత్ కు మిత్రదేశం రష్యా కూడ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో రష్యా లో ఈ నెల 9 వ తేదీ నుండి 2వ ప్రపంచ యుద్ధ విజయం పెరేడ్ లు జరుగుతున్నా వేళా భారత్ కాస్త వేచి చూస్తుందని పేర్కోవడం విశేషం. ఒకవేళ యుద్ధం వస్తే దేశ పౌరులు ఎలా రక్షణ పొందాలో, ఎలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నడుచుకోవాలనే అంశంపై రేపటి బుధవారం(మే 7) మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 259 నగరాల్లో ఈ మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసారు. కేంద్ర ప్రభుత్వం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్ సిటీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ దాడులు చేస్తే ఆ ప్రాంతాలు కీలకం కానున్నాయి. ఇక హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDA, మౌలాలీ NFC ప్రాంతాల్లో సా. 4గంటలకు మాక్‌ డ్రిల్ చేయనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *