సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, మంగళవారం తాడేపల్లి లో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని వైసీపీ మున్సిపల్ కార్పొరేటర్లు కౌన్సెలర్స్ సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రశ్నిస్తే నోరు నొక్కుతుందని, ఇకపై కేసులకు లాఠీ దెబ్బలకు లొంగని మొండి రాజకీయం చేస్తేనే ఈ రాక్షస పాలనను ఎదిరించగలం అని, దానికి వైసీపీ క్యాడర్ సిద్ధంగా ఉండాలని, ప్రజలను, పాలనను గాలికి వదిలేసి సీఎం చంద్రబాబు వైసీపీ నేతలపై దొంగకేసులు పెట్టిస్తూన్నారని, ఆయన పాలనను ప్రజలు యేడాదికే ఏవగించుకొంటున్నారని, ఏ ఊరు వెళ్లి ఏ చిన్న పిల్లాడిని అడిగినా.. నీకు పదిహేనువేలు.. నీకు పదిహేనువేలు .. ఓ పెద్దావిడ నీకు 28వేలు అంటూ వీళ్ళ దొంగ హామీల బాగోతం కామెడీగా చెప్పుకొని, మోసపోయామని బాధపడుతున్నారని విమర్శించారు. ఇటీవల ఎందరినో వైసీపీ వాళ్ళను జైలుకు పంపిస్తున్నారని, వైసీపీ నేతలు వంశీని , మాజీ ఎంపీ నందిగం సురేష్ ఫై కేసులపై కేసులు పెట్టి కోర్ట్ లు ఎన్ని బెయిల్ స్ ఇచ్చిన మరల కొత్త కేసులు పెట్టి జైళ్లలో మగ్గేలా వేధిస్తున్నారని, వాళ్ళ నేతలే నాటకీయంగా మా నేతల దగ్గరకు వచ్చి తిట్టిపోసి మరల మా నేతలపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేదించే నాటకాలు గతంలో ఎప్పుడు జరగలేదని, ఏది ఏమైనా త్వరలో రాష్ట్రంలో జగన్ 2. 0 పాలనా వచ్చి తీరుతుందని, అప్పుడు రెడ్ బుక్ పేరు కాదని .. అంతకు మించి రెండు ఇంతలు వారికీ సినిమా చూపిస్తానని క్యాడర్ కు హామీ ఇస్తున్నానని, మిమ్మలను వేధించిన వారి పేర్లు ఎదో బుక్ లో రాసిఉంచండి ఏది మరచిపోము.. ఎవరు ఎక్కడికి పారిపోయిన వదిలి పెట్టె ప్రశ్న లేదు అని హెచ్చరించారు.
