సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ క్రికెట్ చరిత్రలో తీవ్ర విషాదం జరిగింది. బెంగళూరులో ఐపీఎల్ 2025 విజయోత్సవాలు లో పాల్గొనేందుకు 2 లక్షల మంది అభిమానులు 40వేలు పెట్టె స్టేడియం కు తరలిరావడంతో జరిగిన త్రొక్కిసలాటలో 11 మంది మృతి చెందటం పలువురు గాయాలు పాలవడం గత సాయంత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు టైటిల్ గెలుచుకున్న ఆనందం అభిమానులకు కొన్ని గంటలు కూడా నిలవలేదు. చిన్నస్వామి స్టేడియంకు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన తమ భవిషత్తు కన్నా, ప్రాణాలు కన్నా ఎక్కువగా ప్రేమించి క్రికెట్ పిచోళ్లను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఆర్సీబీ టైటిల్ గెలిచినప్పటి నుంచి అంబరాన్నంటిన సంబరాలు బుధవారం నాటి ఈ దుర్ఘటనతో మూగబోయాయి.ఈ దురదృష్టకర ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్సీబీ, కేఎస్‌సీఏ యాజమాన్యాలు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాయి.
