సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గత శనివారం రాత్రి భీమవరం లోని కేఎస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన పశ్చిమగోదావరి బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొని క్యాడర్ తో గత 11 సంవత్సరాల మోడీ సుపరిపాలన, సేవ, వికసిత్ భారత్, యోగా దినోత్సవం & బలిదాన్ దివాస్ , ఎమర్జెన్సీ కార్యక్రమాలపై మాట్లాడారు. 2014లో ప్రారంభమైన ప్రధాని మోడీ పరిపాలన వల్ల అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగిందని, ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా భారత్ ను నిలిపిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని అన్నారు.స్కిల్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి అన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 9 నుండి 29వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ గత 11 సంవత్సరాలు మోదీ పాలన లో సాధించిన విజయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు తీసుకు వెళ్ళటంలో కృషి చేయాలని అన్నారు. .ఈనెల 13 14 15 తేదీల్లో వికసిత్ భారత్ సంకల్ప సభ ప్రతి మండలాల్లో నిర్వహించాలని, 16 17 18 తేదీల్లో నగరాల్లో వీధుల్లో రచ్చబండల వద్ద గ్రామపంచాయతీ కేంద్రాల్లో కూడా సమావేశాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు
