సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి మహిమ తెలుగు రాష్ట్రాలలో అందరికి తెలిసిందే. అందుకే ప్రతి రోజు ఎంతో దూరప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ అమ్మవారికి మొక్కులు, కానుకలు చెల్లించుకొంటున్నారు. ఈనేపథ్యంలో విజయవాడ గుంటూరు, మార్కాపురం, హనుమాన్ జంక్షన్ తదితర వివిధ ప్రాంతాల నుండి భక్తులు నేడు, శనివారం శ్రీ అమ్మవారిని దర్శించుకొని పెద్ద ఎత్తున ఆషాఢ మాసం సారే ను సమర్పించారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి మందిరం నుంచి మరియు బొండాడ వారి వీధి, పెదఅమిరం మరియు విజయవాడ, ఇతర ప్రాంతాల నుండి మహిళా భక్తులు మొత్తం కలపి సుమారు సుమారు 2000 కేజీల స్వీట్స్ తో వేలాది మహిళలు వందల సంఖ్య చొప్పున గ్రూపులుగా చేరి మేళ తాళాలు తో ఊరేగింపుగా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు.
