సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సాటి వారి పట్ల ప్రేమ – సహనం పాటించండి.. ఆకలి గొన్న వారికీ అన్నం పెట్టండి, అదే పెద్ద దైవ కార్యం అని భక్తులకు సద్గురు సాయి బోధనలకు ప్రభావితం అయిన కోట్లాది భక్తులకు కొదవ లేదు, వారి మానవత్వానికి సేవలకు అంతులేదు.. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా షిర్డీ సాయి దేవాలయాలు భారీ స్థాయిలో నిర్మిస్తుండటం వాటి వద్ద కూడా ప్రతి గురువారం లక్షలాది భక్తులకు భోజన ప్రసాదం ,ప్రతిరోజూ యోగ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటం తెలిసిందే.. అమెరికాలో బాబా వారి దేవాలయాలకు కొదవ లేదు. అయితే నూతనంగా గత గురువారం కనెక్టికట్‌లో షిరిడీ సాయి ప్రతిష్టాకర ఆలయం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది, కనెక్టికట్‌లోని సాయి భక్తుల చిరకాల స్వప్నంనెరవేరుతున్న నేపథ్యంలో ఈ జూన్ 6, 7, 8 తేదీల్లో నుండి వారోత్సవాలు గ జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం జూన్ 6న గోపూజ , గణపతి హోమం సర్వ దేవతా పూజ, వేద సంప్రదాయాలకు అనుగూణంగా అనుభవజ్ఞులైన పూజారులు చేసే అత్యంత ఉత్తేజకరమైన శ్రీ సాయి దత్త హోమంతో వేడుకలు కొనసాగాయి. దైవిక శక్తులను ఆవాహనం చేస్తూ ఆలయ స్థలాన్ని పవిత్రం చేయడానికి ఈ ఆచారాలు నిర్వహించారు.
