సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అడ్జక్షుడు ట్రంప్ దూకుడు నిర్ణయాలు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తుంటే.. అతని నిలకడలేని డబల్ గేమ్ నిర్ణయాలు దేశాల మధ్య యుద్ధాలను రాజేస్తూ 3వ ప్రపంచ యుద్దానికి రంగం సిద్ధం చేస్తున్నాయనిపిస్తుంది.. అమెరికా అండతో ఇజ్రాయిల్ చేస్తున్న యుద్దాలు చాలవన్నట్లు ఇరాన్ లోని అణు ప్లాంట్ లపై గత 3 రోజులు క్రితం దాడులు జరిపి అనేక మంది అణు శాస్త్రవేతలను, ఆర్మీ కమాం డర్లు ను మట్టు బెట్టడం తో ఇరాన్ ఆగ్రహంతో ఇజ్రాయిల్ దేశంపై తన ఆధునిక మిసెల్స్ తో విరుచుకొని పడింది. అవి ఇజ్రాయిల్ దేశం గర్వముగా చెప్పుకొనే ఐరన్ డ్రోన్ ను ఛేదించుకొని ప్రధాన నగరాలలో పలు ప్రాంతాలను ఇజ్రాయిల్ సైనిక కార్యాలయాలను ద్వంసం చెయ్యడం తో ఇజ్రాయిల్ తో పాటు అమెరికా ఉలిక్కి పడ్డాయి. అన్ని రోజులు మనవి కావని అర్ధం అయ్యింది. వెంటన్ ముందు చూపుతో ట్రంప్ ఇరాన్ కు మద్దతుగా నిలిచే రష్యా అడ్జక్షుడు పుతిన్ తో ఫోన్ చేసి సమన్వయము పాటించమని ఇరాన్ కు చెప్పాలని కోరటం దానికి పుతిన్ ట్రంప్ కు తనదయిన శైలిలో సమాధానం ఇవ్వడం జరిగిపోయాయి. ఇంతలో ఇజ్రాయిల్ , ఇరాన్ లకు ఇద్దరికీ మిత్ర దేశం భారత్ పరిస్థితి సంకటం లో పడింది. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు భారత ప్రధాని మోడీ కి ఫోన్ చేసి తమ పరిస్థితి వివరించడం జరిగింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయ శంకర్ ఇరాన్ మంత్రులతో మాట్లాడటం జరిగింది. 3వ రోజు నేటి ఆదివారం తెల్లవారు జామునుండి కూడా ఇరుదేశాల మధ్య దాడులు ప్రతిదాడులతో జన నష్టం అష్టి నష్టం తో ఘోరమైన పరిస్థితి ఉంది. ట్రంప్ హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ దారుణానికి వెనుక నుండి నడిపిస్తున్న అమెరికా ఐరోపా దేశాలను వదలమని వాటిపై దాడులు చేస్తామని ఇరాన్ తాజా గా ప్రకటించింది. ఇది అటుతిరిగి ఇటు తిరిగి 3వ ప్రపంచ యుద్దానికి బాటలు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ ధరలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *